
Ts News: ‘ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు’.. నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి: రేవంత్
హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో ‘ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు’ అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు వివరించాలన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఇంఛార్జ్‌లతో రేవంత్ రెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వచ్చే వారం రోజులపాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడు, విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకు వెళ్లాలన్నారు. భాజపా, తెరాస పార్టీల మోసపూరిత విధానాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, నష్టాలను వివరించాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భాజపా, తెరాస లోపాయికారి ఒప్పందాలు, చీకటి రాజకీయాలను బయట పెట్టాలని నేతలకు సూచించారు. కాంగ్రెస్ వైపు ప్రజలు నిలబడేలా ప్రచార వ్యుహాలను అమలు చేయాలన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.