Ap News: కుప్పం ఎన్నికను చంద్రబాబు సాధారణ ఎన్నికల్లా భావిస్తున్నారు: సజ్జల

చిత్తూరు జిల్లాలోని కుప్పం ఓటర్లను తెదేపా నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతిలో మీడియాతో

Updated : 15 Nov 2021 16:28 IST

అమరావతి: చిత్తూరు జిల్లాలోని కుప్పం ఓటర్లను తెదేపా నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన సజ్జల.. తెదేపా ప్రలోభాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. కుప్పం ఎన్నికను సాధారణ ఎన్నికల్లా భావించి.. తెదేపా అధినేత చంద్రబాబు అనవసర హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి బూత్‌లో తెదేపా అభ్యర్థి, ఏజెంట్‌ ఉంటారని.. వారు ఉన్నప్పటికీ గొడవలు చేసి ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో తెదేపా ఏజెంట్లుగా నలుగురు రౌడీ షీటర్లు ఉన్నారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని