AP News: ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ ఎన్నికకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల
అమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మండల, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు తేదీలు ఖరారు చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ.. 25న మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు.
ప్రతిసారి జిల్లా పరిషత్‌లో ఛైర్మన్, ఒక వైస్ ఛైర్మన్‌ను సభ్యులు ఎన్నుకునేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేయడంతో రెండో వైస్ ఛైర్మన్‌ను సైతం ఎన్నుకోనున్నారు. నగరపాలక సంస్థల్లో, పురపాలక సంఘాల్లోనూ రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్ ఛైర్మన్ల స్థానాలను కూడా కొత్తగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి
-
Tirumala: తిరుమలలో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Game Changer: అందుకే షూటింగ్ వాయిదా.. రూమర్స్‌పై ‘గేమ్ ఛేంజర్’ టీమ్
-
TOEFL: విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌పై.. భారతీయుల మొగ్గు!
-
India vs Australia: ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నారు.. కంగారూల ఎదుట భారీ లక్ష్యం