Published : 12 Nov 2021 14:01 IST

Smriti Irani: ఇంట్లో ఉన్న అబ్బాయి పోరాడకుండా కూర్చున్నాడు..!

ప్రియాంకాగాంధీకి కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, హామీలతో ఓటర్లను ఆకట్టుకునే దిశగా సాగుతున్నాయి. ఈ క్రమంలో యూపీ ఎన్నికల వేళ కీలకంగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి, భాజపా నేత స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. 

‘నేను మహిళను. నేను పోరాడగలను’ అంటూ ప్రియాంక చేసిన వ్యాఖ్యకు స్మృతి స్పందిస్తూ..‘ఇంట్లో అబ్బాయి ఉన్నాడు. కానీ పోరాడలేడు’ అంటూ రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే అని ప్రియాంక చేసిన ప్రకటనపై స్పందించారు. మహిళలకు 60 శాతం సీట్లు ఇవ్వడం ఇష్టంలేదని ప్రియాంక మాటలను బట్టి తెలుస్తోందన్నారు. అలాగే మహిళా నేతలు సమాజంలోని తోటి మహిళల కోసమే పనిచేయాలని ఆశించకూడదన్నారు ‘మహిళలు ఎవరైనా సరే రాజ్యాంగపరమైన బాధ్యత పొందినప్పుడు.. వారు మహిళల కోసం ఎంత పనిచేస్తారో, పురుషులు, పిల్లలు, వృద్ధుల కోసం కూడా అంతే పనిచేయాల్సి ఉంది’ అని వెల్లడించారు. ఈ సారి యూపీ ఎన్నికలు అభివృద్ధి అనే అంశంపైనే జరుగుతాయన్నారు. అలాగే ఇటీవల పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను పొగుడుతూ ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలను ఇరానీ తప్పుపట్టారు. సర్దార్ వల్లభ్‌ బాయ్ పటేల్, జిన్నాను పోల్చడం సరికాదని విమర్శించారు. ఒకరు ముక్కలుగా ఉన్న దేశాన్ని కలిపితే.. మరొకరు మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని