Somu Veerraju: హిందువుల పండుగలపైనే ఆంక్షలెందుకు?: సోము వీర్రాజు

వినాయకచవితిని ఇళ్లలోనే జరుపుకోవాలంటూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. హిందువుల పండుగలపైనే ఎందుకు ఆంక్షలు..

Published : 05 Sep 2021 14:48 IST

కర్నూలు: వినాయకచవితిని ఇళ్లలోనే జరుపుకోవాలంటూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువుల పండుగలపైనే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు. కొవిడ్‌ నిబంధనలతో వినాయకచవితి జరుపుకొనేందుకు అనుమతించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బయటకొస్తే అరెస్ట్‌ చేస్తామని ఎలా అంటారని ప్రశ్నించారు. ఒక వర్గానికి సంబంధించే మీ ప్రభుత్వం ఉంటుందా? అని నిలదీశారు. రాష్ట్రంలో సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని