AP News: కేంద్ర పథకాలకు సీఎం పేరు ఎలా పెట్టుకుంటారు?: సోము వీర్రాజు

కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు...

Published : 06 Dec 2021 01:22 IST

గుంటూరు: కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న 36 పథకాలకు కేంద్రం సాయం చేస్తోందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సైతం ప్రధాని పేరున కాకుండా తమ పేర్లు వేసుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికి 21 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, ఒక్కో ఇంటికి రూ.1.80లక్షలు మంజూరు చేస్తుందని వివరించారు. గుంటూరులో రాజ్యాంగ ఆమోద ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీలో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని