
Chandrababu Naidu: చంద్రబాబును పరామర్శించిన సోనూసూద్
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటీవల జరిగిన పరిమాణాలపై నటుడు సోనూసూద్ విచారం వ్యక్తం చేశారు. మానసికంగా ఎంతో బాధపడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును ఆయన ఫోన్‌లో పరామర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైన శాసనసభలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. దేవాలయంలాంటి అసెంబ్లీలో విధ్వంస ధోరణి మంచిదికాదన్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబును కలుస్తానని తెలిపారు. అసెంబ్లీలో శుక్రవారం పలువురు నేతలు తన సతీమణి భువనేశ్వరిని దూషించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడూ లేనంతగా భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడవడం రాజకీయ, సినీ ప్రముఖుల్ని కలచివేసింది. దీనిపై పలువురు సామాజిక మాధ్యమాల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రజనీకాంత్ ఆదివారం ఉదయం చంద్రబాబుతో ఫోన్ ద్వారా మాట్లాడారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.