Perni Nani: భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు: పేర్ని నాని

వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతిస్తున్నట్టు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

Published : 26 Sep 2021 01:41 IST

మచిలీపట్నం : వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎల్లుండి నిర్వహించ సోమవారం భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతిస్తున్నట్టు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అనేక రైతు సంఘాలు కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాయన్నారు. విశాఖ ఉక్కును కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేయవద్దని చేస్తున్న భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దత్తు ఇస్తుందని తెలిపారు. 27వ తేదీ అర్ధరాత్రి నుంచి 28 మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు తిరగవని తెలిపారు. రైతాంగానికి, విశాఖ ఉక్కుకు సంబంధించి పోరాటం చేస్తున్న వారంతా శాంతియుతంగా బంద్ నిర్వహించాలన్నారు. ఒంటి గంట నుంచి బస్సులు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని, 3  రైతు చట్టాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని