Congress: ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌ ఆందోళన.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ఎల్‌బీనగర్‌ కూడలిలో కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ ర్యాలీ సందర్భంగా ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి

Updated : 02 Oct 2021 20:41 IST

హైదరాబాద్‌: ఎల్‌బీనగర్‌ కూడలిలో కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ ర్యాలీ సందర్భంగా ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించేందుకు కాంగ్రెస్‌ నేతలు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు భారీగా తరలివచ్చారు. ఈక్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్త, విద్యా్ర్థి కల్యాణ్‌ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో ఎల్బీనగర్‌- ఉప్పల్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని