AP News: ఎయిడెడ్‌ విలీనంపై విద్యార్థుల ఆందోళన.. విజయవాడలో ఉద్రిక్తత

ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో జనసేన, పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన 

Updated : 11 Nov 2021 15:41 IST

విజయవాడ: ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో జనసేన, పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. వన్‌టౌన్‌ పరిధి కొత్తపేటలోని ఎస్‌కేపీవీ హిందూ హైస్కూల్‌ ముందు ఆందోళన చేపడుతున్న విద్యార్థులు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసనగా పోలీసు వాహనాలపై విద్యార్థులు దాడికి యత్నించారు. 

పరిస్థితి చేయి దాటుతుండటంతో అదుపులోకి తీసుకున్న నాయకులను పోలీసులు విడిచిపెట్టడంతో విద్యార్థులు శాంతించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనానికి సంబంధించిన జీవోలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే విద్యార్థులతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని జనసేన నేత పోతిన మహేశ్‌ హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని