Talasani Srinivas: అలా అనడం ఈటల అహంకారానికి నిదర్శనం: తలసాని

భాజపా నేత ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగార్జున సాగర్‌లో

Updated : 12 Aug 2021 16:23 IST

హైదరాబాద్: భాజపా నేత ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డికి పట్టిన గతే.. ఉప ఎన్నికలో ఈటలకు పడుతుందన్నారు. హైదరాబాద్‌లో తలసాని మీడియాతో మాట్లాడారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను బానిసగా పేర్కొనడం.. ఈటల అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈటల ముందు గెల్లు శ్రీనివాస్ యాదవ్ చిన్న పిల్లవాడు కావచ్చు కానీ.. మొదట పోటీ చేసినప్పుడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడేనని గర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈటల హుజూరాబాద్‌లో బీసీ.. శామీర్‌పేటలో ఓసీ అని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులకు తెరాస మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తోందని.. గతంలో బాల్క సుమన్, కిశోర్ తదితరులకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇప్పుడు గెల్లు శ్రీనివాస్‌కు కూడా అదే విధంగా సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని