AP News: కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు.. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణుల ఆందోళన

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యకర్తలు నిరసన చేపట్టారు. గుంటూరు, నెల్లూరు, విజయనగరం, అనంతపురం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో ...

Updated : 19 Nov 2021 22:30 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యకర్తలు నిరసన చేపట్టారు. గుంటూరు, నెల్లూరు, విజయనగరం, అనంతపురం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. విజయనగరంలో అశోక్‌గజపతిరాజు ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరులో ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇంటి ఎదుట తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు, పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఎమ్మెల్యే అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

అనంతపురంలో ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

కార్యకర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉందని మండిపడ్డారు. ఇంత దారుణమైన ప్రభుత్వా్న్ని ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పురుగుల మందు తాగిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను తెదేపా నేతలు కాల్వ శ్రీనివాసులు, ప్రభాకర్‌ చౌదరి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

పశ్చిమ గోదావరిలో పురుగుల మందు తాగిన కార్యకర్త..

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో తెలుగుదేశం అభిమాని ఆత్మహత్యాయత్నం చేశాడు. చంద్రబాబుపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్త నాగేశ్వరరావు పురుగుల మందు తాగాడు. చంద్రబాబు కంటతడి పెట్టుకోవడం తట్టుకోలేక ఈ పని చేస్తున్నట్టు చెప్పాడు. వెంటనే నాగేశ్వరరావును కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు.

*గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు సీఎం జగన్‌, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. చిలకలూరిపేట తెదేపా కార్యాలయం నుంచి ఎంఆర్టీ సెంటర్ వరకు సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పార్టీ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. అక్కడే దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు