AP News: చంద్రబాబు ఇంటిపై దాడి ఘటన.. గవర్నర్‌ను కలవనున్న తెదేపా బృందం

తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి తెదేపా నేతలు గవర్నర్‌ను కలవనున్నారు.

Updated : 18 Sep 2021 14:32 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి తెదేపా నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్ కోరిన తెదేపా నేతలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సాయంత్రం 4 గంటలకు తనను కలిసేందుకు సమయం ఇచ్చారు. వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, ఆలపాటి రాజా, అశోక్ బాబులతో కూడిన బృందం గవర్నర్ కలవనుంది. నిన్న చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనపై పూర్తి సాక్ష్యాధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జోగి రమేష్ దండయాత్రగా చంద్రబాబు నివాసం పైకి వచ్చాడని సీసీ టీవీ వీడియోలను గవర్నర్ కు సాక్ష్యాలుగా తెదేపా నేతలు అందజేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని