Updated : 03/10/2021 20:27 IST

TDP: బద్వేల్‌ ఉప ఎన్నికకు తెదేపా దూరం

అమరావతి: కడప జిల్లాలోని బద్వేల్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని తెదేపా నిర్ణయించింది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన తెదేపా పొలిట్‌ బ్యూరో బద్వేల్‌ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయించింది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణికే టికెట్‌ ఇచ్చినందున పోటీకి తెదేపా విముఖత వ్యక్తం చేసింది. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్‌లో పోటీ చేయడం లేదని తెదేపా వెల్లడించింది. వైకాపా ఎమ్మెల్యే  వెంకటసుబ్బయ్య మృతితో బద్వేల్‌ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. పొలిట్‌ బ్యూరో నిర్ణయానికి ముందు బద్వేల్‌ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌ను తెదేపా ఖరారు చేసింది. 2019లో బద్వేల్‌ తెదేపా అభ్యర్థిగా రాజశేఖర్‌ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే వైకాపా టికెట్‌ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని ఇప్పటికే ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని