AP News: ఎయిడెడ్‌ కళాశాలల భూములపై జగన్‌ కన్నేశారు: లోకేశ్‌

మాజీ సీఎంలు, పారిశ్రామిక వేత్తలు, ఇతరత్రా రంగాల్లో నిపుణులుగా ఉన్న వారెందరో ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల నుంచే వచ్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ..

Updated : 10 Nov 2021 17:17 IST

అనంతపురం: మాజీ సీఎంలు, పారిశ్రామిక వేత్తలు, ఇతరత్రా రంగాల్లో నిపుణులుగా ఉన్న వారెందరో ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల నుంచే వచ్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. అటువంటి వ్యవస్థను సీఎం జగన్‌ ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎయిడెడ్‌ పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించడం, ఎయిడెడ్‌ విలీన ప్రక్రియలకు వ్యతిరేకంగా లోకేశ్‌ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో 2 వేలకు పైగా ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2 లక్షల మంది, 182 జూనియర్‌ కళాశాలల్లో 71 వేల మంది విద్యార్థులున్నారు. ఎయిడెడ్‌ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అన్ని ప్రభుత్వ పథకాలకు జగన్‌ పేరు పెట్టారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. కేవలం విధ్వంసం మాత్రమే ఉంది. ఎయిడెడ్‌ కళాశాలల భూములపై జగన్‌ కన్నేశారు’’ అని లోకేశ్‌ ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని