ఆ తవ్వకాలపై ఆధారాలున్నాయి: ఆనంద్‌బాబు

విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలపై గిరిజనుల ఆందోళన చేస్తున్నా ఏపీ ప్రభుత్వానికి పట్టట్లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు..

Updated : 21 Jul 2021 13:12 IST

అమరావతి: విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలపై గిరిజనుల ఆందోళన చేస్తున్నా ఏపీ ప్రభుత్వానికి పట్టట్లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు. వైకాపా సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు లేటరైట్ ముసుగులో బాక్సైట్‌ తవ్వుతున్నారని ఆరోపించారు. వాస్తవాలు బయటకొస్తాయనే.. పరిశీలనకు వెళ్లిన తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాక్సైట్‌ తవ్వకాలపై పూర్తిస్థాయి ఆధారాలు తెదేపా వద్ద ఉన్నాయని ఆనంద్‌బాబు చెప్పారు. ఈ దోపిడీలో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రణాళికబద్ధంగా రూ.15 వేల కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. చెట్లను నరికి అడవులను ప్రభుత్వమే నాశనం చేస్తుంటే అటవీ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు