AP News: హైకోర్టు అనుమతులుంటే ఆంక్షలెందుకు?: లోకేశ్‌

అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్రలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తప్పుబట్టారు.

Updated : 11 Nov 2021 13:48 IST

అమరావతి: అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్రలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తప్పుబట్టారు. ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

పాదయాత్రకు ఆటంకాలు కలిగించడం న్యాయమా అని లోకేశ్‌ ప్రశ్నించారు. హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకు ఆంక్షలెందుకు అని నిలదీశారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్‌రెడ్డికి చలిజ్వరం పట్టుకుందని ఎద్దేవా చేశారు. పోలీసులతో పాదయాత్రను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ ఆపాదించి పాదయాత్రను అడ్డుకోవడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని