AP News: మారిటైమ్‌ బోర్డు నిధులు రూ.1,200కోట్లు కొల్లగొట్టారు: పట్టాభి

లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును అందినకాడికి అమ్మినట్లే, ఏపీ మారిటైం బోర్డు నిధులను సైతం ప్రభుత్వం దారి

Updated : 30 Dec 2021 13:00 IST

మంగళగిరి: లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును అందినకాడికి అమ్మినట్లే, ఏపీ మారిటైం బోర్డు నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లించిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని అనేక పోర్టులకు ఉపయోగించాల్సిన మారిటైమ్‌ బోర్డు నిధులు రూ.1,200కోట్లను కొల్లగొట్టిందని ఆక్షేపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పట్టాభి మీడియాతో మాట్లాడారు.

అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తో్ందని ఆరోపించారు. ఆయా చోట్ల ఉన్న సొమ్ము దోచేస్తోందంటూ ఆయన మండిపడ్డారు. గంగవరం పోర్టుపై మేం లేవనెత్తిన అంశాలపై ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని పట్టాభి అన్నారు. మంత్రుల నుంచి సమాధానం రాలేదంటే తప్పు చేశారని అనుకోవచ్చా అని ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని