Pattabhi: వెల్లంపల్లి సోదరుడిని ఎందుకు అరెస్టు చేయలేదు?: పట్టాభి

ఏపీలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి మరోసారి విమర్శలు గుప్పించారు.

Updated : 31 Aug 2021 16:21 IST

 

అమరావతి: ఏపీలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి మరోసారి విమర్శలు గుప్పించారు. నకిలీ పత్రాలు సృష్టించారంటూ సుధాకర్‌ ఇన్‌ఫ్రాపై జేపీ పవర్‌ వెంచర్స్ ఫిర్యాదు ఇస్తే.. అదే సంస్థకు గోదావరి డ్రెడ్జింగ్‌ కాంట్రాక్టును సీఎంఓ ఎందుకు సిఫార్సు చేసిందని నిలదీశారు. జేపీ వెంచర్స్‌ ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న మంత్రి వెలంపల్లి సోదరుడితో పాటు మరికొందరిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి సుధాకర్ ఇన్‌ఫ్రాకు సీఎం కార్యాలయం నుంచే అనుమతులు వెళ్లాయంటూ తాము బయటపెట్టిన పత్రాలన్నీ నిజమైనవే అని చెప్పారు. వాస్తవాలు బయటకొచ్చే సరికి గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది మాట మార్చారని పట్టాభి విమర్శించారు.

ఏపీలో జేపీ పవర్ వెంచర్స్‌కు మాత్రమే ఓపెన్ ఇసుక రీచ్‌లలో ఇసుక మైనింగ్‌కు అనుమతి ఉందని ద్వివేది నిన్న స్పష్టం చేశారు. సీఎంవో సిఫార్సుల ద్వారా సుధాకర్ ఇన్‌ఫ్రా సంస్థకు గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇచ్చారన్నది అవాస్తమని వెల్లడించారు. జేపీ పవర్ వెంచర్స్ నుంచి సబ్ కాంట్రాక్టు పొందిననట్టుగా కొందరిని మోసం చేస్తున్న అంశంలో సుధాకర్ ఇన్‌ఫ్రాపై జూన్ 4న విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు నమోదైందన్నారు. దీన్నే కొత్తగా ఏదో జరిగినట్టు తెదేపా నేతలు చిత్రీకరిస్తున్నారని సోమవారం ద్వివేది వెల్లడించిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని