AP News: సీఎంపై వ్యాఖ్యల కేసులో తెదేపా నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్‌  

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను తోట్లవల్లూరు పీఎస్‌ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు సాయంత్రం కోర్టులో హాజరుపర్చారు. ఈసందర్భంగా పట్టాభికి

Updated : 21 Oct 2021 20:20 IST

విజయవాడ: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను తోట్లవల్లూరు పీఎస్‌ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు సాయంత్రం కోర్టులో హాజరుపర్చారు. ఈసందర్భంగా పట్టాభికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అంతకు ముందు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఎం జగన్‌పై పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య ఆయనను నిన్న రాత్రి 10 గంటలకు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని