
AP News: జగన్ నెట్‌వర్క్‌లో ఏపీ భాజపా: పయ్యావుల
అనంతపురం: ఏపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలు కొనసాగిస్తున్నా రాష్ట్ర భాజపా నేతలు మాత్రం నోరెత్తడం లేదని తెదేపా సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. భాజపాకు బ్రాండ్‌గా ఉన్న హిందుత్వ అంశాలపైనా మౌనంగా ఉన్నారని.. ఆలయాలపై దాడులు జరిగినా ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదని ఆక్షేపించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడారు. విజయవాడలో మంగళవారం భాజపా నిర్వహించేది ప్రజాగ్రహ సభ కాదని.. జగన్ అనుగ్రహ సభ అంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర భాజపా నేతలకు తెలియదా?కేంద్రహోంమంత్రి అమిత్‌షా వచ్చి చెబితేనే మేలుకొన్నారు. పోలీసులే సామాన్యుల రూపంలో వచ్చి దాడులు చేసే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఉన్న భాజపా.. ప్రజలకోసం కాకుండా ప్రభుత్వం కోసం పనిచేసేరకంగా తయారైంది. దేశం మొత్తంపై ఉన్న భాజపా మోదీ, అమిత్‌షా నెట్‌వర్క్‌లో పనిచేస్తుంటే.. ఏపీ భాజపా మాత్రం జగన్ నెట్‌వర్క్‌లో పనిచేస్తోంది. కేంద్ర నిధులు దారిమళ్లిస్తుంటే ఇక్కడి భాజపా నేతలకు ఏమాత్రం పట్టట్లేదు. నిజంగా ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఆర్థిక అరాచకాలపై పోరాడాలి’’ అని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.