AP News: ఇద్దరు, ముగ్గురు హీరోలపై కక్షతో సినిమా పరిశ్రమను నాశనం చేస్తారా?: సోమిరెడ్డి

సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుతో పేదలకు ఏదో ప్రయోజనం చేశామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తోందన్న విషయాన్ని..

Updated : 26 Dec 2021 15:19 IST

అమరావతి: సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుతో పేదలకు ఏదో ప్రయోజనం చేశామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తోందన్న విషయాన్ని గమనించడం లేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఇద్దరు, ముగ్గురు హీరోలపై కక్షతో సినిమా పరిశ్రమను నాశనం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు.

ఇప్పటికే రాష్ట్రంలో 125 థియేటర్లు మూతపడ్డాయని.. కక్ష సాధింపులకూ అడ్డు ఉంటుందని సోమిరెడ్డి చెప్పారు. సూళ్లూరుపేటలో అతి పెద్ద థియేటర్‌ను మూసివేశారని గుర్తుచేశారు. సినిమా థియేటర్లలో గంజాయి ఏమైనా ఉందా? అని నిలదీశారు.  రాత్రి వెళ్లి దాడులు చేసి మూసివేసే హక్కు ఎవరిచ్చారని సోమిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో రైతుబంధు కింద రూ.10వేలు ఇస్తున్నారని.. పథకాలతో పోటీ పడాలని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వానికి చేతనైతే నిత్యావసర వస్తువులు, ఇసుక ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని