AP News: రూ.40కోట్ల సుపారీ ఇచ్చిందెవరో జగన్‌కు తెలుసు: వర్ల రామయ్య

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపిదెవరో సీఎం జగన్‌కు గతంలోనే తెలుసని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు

Updated : 14 Nov 2021 14:58 IST

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపిదెవరో సీఎం జగన్‌కు గతంలోనే తెలుసని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. అన్నీ తెలిసే సీబీఐ విచారణ అంటూ జగన్‌ నాటకాలాడారని ఆక్షేపించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు.

ప్రతిపక్ష నేత హోదాలో సీబీఐ విచారణ కోరిన జగన్‌.. సీఎం అయ్యాక వెనక్కి తగ్గారని ఆరోపించారు. ఆ తర్వాత హైకోర్టులో వేసిన కేసునూ ఎందుకు వెనక్కి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు రక్తచరిత్రను వాడుకున్న వ్యక్తి జగన్‌ అని ధ్వజమెత్తారు. వివేకా హత్యకు రూ.40కోట్ల సుపారీ ఇచ్చిందెవరో ఆయనకు తెలుసని వర్ల రామయ్య ఆరోపించారు.

ఎవరు చంపారో జగన్‌కు తెలుసు..

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు చంపారనే విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలుసునని తెదేపా నేత చినరాజప్ప అన్నారు. హంతకులు ఎవరనేది తెలిసీ రెండున్నరేళ్లుగా మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికైనా హంతకులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని