Yanamala: రెండున్నరేళ్లుగా అప్పులే.. వాటికీ లెక్కాపత్రం లేదు: యనమల

అప్పులు తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.

Published : 12 Sep 2021 13:32 IST

అమరావతి: అప్పులు తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. సంక్షేమంలో గత తెదేపా కన్నా వైకాపా ప్రభుత్వం తక్కువగా ఖర్చు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు 32 శాతం నుంచి 43 శాతానికి పెరిగాయని విమర్శించారు. ఈ మేరకు యనమల ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి రెండున్నరేళ్లుగా అప్పులే తప్ప ఆదాయ మార్గాలు లేవని.. తెచ్చిన అప్పులకూ లెక్కాపత్రం లేదని ఆక్షేపించారు. 

అప్పు తెచ్చిన రూ.2.68లక్షల కోట్లలో రూ.1.05 లక్షల కోట్లు సంక్షేమం కోసమని రాష్ట్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారని.. వాస్తవంగా ఖర్చు చేసింది రూ.68వేల కోట్లు మాత్రమేనని యనమల చెప్పారు. కేపిటల్‌ ఎక్స్‌పెండిచర్ కోసం రూ.31వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. మిగిలిన రూ.1.68లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. ఎవరి జేబుల్లోకి మళ్లించారని ఆయన నిలదీశారు. గత తెదేపా ప్రభుత్వం 17 సంక్షేమ పథకాలు అమలు చేస్తే వైకాపా కొత్తగా 5 పథకాలు మాత్రమే తీసుకొచ్చిందన్నారు. సంక్షేమ పథకాలపై ఖర్చులో దేశంలోనే రాష్ట్రం 18వ స్థానంలో నిలిచిందన్నారు. ఎడా పెడా చేస్తున్న అప్పులు, ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్ము ఏమవుతోందని యనమల నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని