AP Politics: అర్ధరాత్రి బ్లాంక్‌ జీవోలు ఇస్తున్నారు: వర్ల రామయ్య

ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య,

Published : 13 Aug 2021 13:09 IST

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన తెదేపా నేతలు

విజయవాడ: ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బ్లాంక్‌, రహస్య జీవోల వ్యవహారంపై గవర్నర్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ నేతృత్వంలో అర్ధరాత్రి బ్లాంక్‌ జీవోలు జారీ చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. 

12 రోజుల్లో 50 బ్లాంక్‌ జీవోలు ఇచ్చారని.. వాటిలో తేదీ, జీవో నంబర్‌ మాత్రమే ఉంటోందన్నారు. పారదర్శక పాలన ఎందుకు చేయలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. బ్లాంక్‌ జీవోలను చూపితే గవర్నర్‌ ఆశ్చర్యపోయారన్నారు. ఇకనైనా అర్ధరాత్రి బ్లాంక్‌ జీవోలు జారీ చేయడాన్ని మానుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు. జీవోలు గవర్నర్ పేరుతో జారీ చేస్తారని.. ఈ విషయంలో ఆయన కూడా బాధ్యత వహించాలని గద్దె రామ్మోహన్‌ కోరారు. దీనిపై విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని