
AP News: ఎయిడెడ్ పాఠశాలలపై జగన్‌ది అనాలోచిత చర్య: తెదేపా
విశాఖ: నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా నేతలు నిరసనకు దిగారు. ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి, సీనియర్ నేత పల్లా శ్రీనివాసరావు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తదితరులో కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెదేపా నేతలు మాట్లాడారు. సీఎం జగన్ అనాలోచిత చర్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.