ఇప్పుడేమీ మాట్లాడను: తెదేపా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

తెదేపాకు రాజీనామా చేయనున్నారంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న

Updated : 27 Aug 2021 21:16 IST

రాజమహేంద్రవరం: తెదేపాకు రాజీనామా చేయనున్నారంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సరిగా స్పందించలేదు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు గురువారం ఆయన నివాసం వద్ద ప్రశ్నించగా దానిపై ఇప్పుడేమీ మాట్లాడనని చెప్పారు. అనుబంధ కమిటీలు, స్థానిక నాయకత్వంపై గత కొద్దిరోజులుగా బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా ఇప్పుడేమీ మాట్లాడనని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్‌

తాజా పరిణామాల నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు. అసంతృప్తి విషయంపై ఆయనతో మాట్లాడారు. స్థానికంగా ఇబ్బందులుంటే తనకు చెప్పాలని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని