AP Politics: చంద్రబాబుపై నీచమైన భాష ఉపయోగించినప్పుడు ఏం చేస్తున్నారు?: గోరంట్ల

తెదేపా అధినేత చంద్రబాబుపై నీచమైన భాష ఉపయోగించినప్పుడు.. పోలీసులు కళ్లు మూసుకొని కూర్చున్నారా?

Updated : 18 Sep 2021 09:26 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుపై నీచమైన భాష ఉపయోగించినప్పుడు.. పోలీసులు కళ్లు మూసుకొని కూర్చున్నారా?అని తెదేపా ఎమ్మెల్యే, సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య ధ్వజమెత్తారు. వైకాపా ఉపయోగించిన భాష డీజీపీకి వినిపించలేదా అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు ఇప్పుడు వాస్తవాలు చెబితే ఎందుకు భరించలేకపోతున్నారన్నారు. తెదేపా శ్రేణులు, నాయకులు క్రమశిక్షణతో ఉంటారని.. అదే క్రమ శిక్షణ తప్పితే వైకాపా నేతలు బయట తిరగలేరని ఆయన హెచ్చరించారు. ఒక చెంప మీద కొడితే తిరిగి రెండు చెంపలు మీద కొట్టే సత్తా ఉందని గోరంట్ల స్పష్టం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని