AP Assembly: కాలినడకన అసెంబ్లీకి వెళ్లిన చంద్రబాబు, తెదేపా ఎమ్మెల్యేలు

ఏపీలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు.

Updated : 18 Nov 2021 12:13 IST

అమరావతి: ఏపీలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. ప్రజలకు భారంగా మారిన పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించాలని.. చెత్తపై పన్ను వంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. వైకాపా పాలనలో సామాన్యులు చితికి పోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు కూడా అధికంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంతకుముందు వెంకటపాలెంలో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని