AP News: సంస్కారం, నాగరికతపై వైకాపా మాట్లాడటం దురదృష్టకరం: కనకమేడల 

వైకాపా సంస్కారం లేని పార్టీ అని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసి తెదేపాపై ఫిర్యాదు చేయడాన్ని

Updated : 02 Nov 2021 13:56 IST

దిల్లీ: వైకాపా సంస్కారం లేని పార్టీ అని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసి తెదేపాపై ఫిర్యాదు చేయడాన్ని తెదేపా ఖండించింది. ఈ మేరకు దిల్లీలో రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత వైకాపా నేతలకు లేదన్నారు. అధికారంలో లేనప్పుడు.. వచ్చిన తర్వాత చంద్రబాబుపై వైకాపా నేతలు మాట్లాడిన మాటలను ఆ పార్టీ ఎంపీలు గుర్తు చేసుకోవాలన్నారు. సంస్కారం, నాగరికత గురించి వైకాపా మాట్లాడటం దురదృష్టకరమని ఆయన చెప్పారు. చట్టాలను గౌరవించని వైకాపా నేతలు చట్టాలు చేయండని రాష్ట్రపతిని కోరడం విడ్డూరమని రవీంద్రకుమార్‌ అన్నారు. ఏపీలో విష సంస్కృతి నెలకొందని.. వైకాపా తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు.

వైకాపా ప్రభుత్వంలోకి వచ్చాక మంత్రులు ప్రతిపక్ష నాయకుడిపై చేస్తున్న వ్యాఖ్యలను అందరూ గమనిస్తున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వారిని దూషిస్తే శిక్షించేలా చట్టం తేవాలని రాష్ట్రపతిని వైకాపా నేతలు కోరడాన్ని స్వాగతిస్తున్నానని.. ప్రతిపక్ష నేత పదవి కూడా రాజ్యాంగబద్ధ పదవి అనే విషయం వైకాపా నేతలకు తెలుసా అని ప్రశ్నించారు. పార్టీ కార్యలయాలపై, నివాసాలపై దాడులు చేసి రాష్ట్రపతిని ఏ విధంగా కలిశారని నిలదీశారు. ప్రభుత్వానికి దమ్ముంటే రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు పూడ్చాలని.. కరెంట్‌ బిల్లులను తగ్గించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని