AP News: బూడిద రత్నాలను నవరత్నాలుగా మోసం: రామ్మోహన్‌నాయుడు

ఉప్పు, పప్పు, చెత్తతో సహా ప్రతి దానిపై వైకాపా ప్రభుత్వం పన్ను వేసి మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోందని శ్రీకాకుళం తెదేపా

Updated : 04 Oct 2021 11:03 IST

గుడివాడ: ఉప్పు, పప్పు, చెత్తతో సహా ప్రతి దానిపై వైకాపా ప్రభుత్వం పన్ను వేసి మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోందని శ్రీకాకుళం తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బూడిద రత్నాలను నవరత్నాలుగా ప్రచారం చేస్తున్న సర్కారు ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రాలేని నాయకులు.. బూతులు తిట్టడంలో మాత్రం పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన తెదేపాకు వెన్నుపోటు పొడిచిన మంత్రి కొడాలి నానికి.. రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజల్లో ఇప్పటికే మార్పు మొదలైందని, 2024 ఎన్నికల్లో వైకాపాకు పరాభవం తప్పదని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని