Updated : 09/09/2021 14:32 IST

AP politics: ఆమదాలవలసలో తెదేపా భారీ ర్యాలీ.. ఎంపీ రామ్మోహన్‌, కూన రవి అరెస్టు

ఆమదాలవలస: నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు.. రైల్వే బ్రిడ్జి నుంచి కృష్ణాపురం వరకు భారీ ర్యాలీగా కదిలారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటు చేసుకొని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో కార్యకర్తలు స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని