AP News: డ్రగ్స్‌తో సంబంధం లేకపోతే విజయసాయి ఎక్కడ?: బుద్దా వెంకన్న

ఏపీలోని డ్రగ్స్‌ దందాలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రమేయముందని తెదేపా సీనియర్‌ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు.

Updated : 03 Oct 2021 15:42 IST

అమరావతి: ఏపీలోని డ్రగ్స్‌ దందాలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రమేయముందని తెదేపా సీనియర్‌ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘డ్రగ్స్‌తో సంబంధం లేకపోతే విజయసాయి ఎక్కడున్నారు. విజయసాయిరెడ్డి తన పార్టీకి కూడా అందుబాటులో లేరు. అతని అల్లుడికి రాష్ట్ర పోర్టుల్లో వాటాలున్నాయి. పోర్టుల ద్వారా వారికి తెలిసే డ్రగ్స్‌ సరఫరా జరుగుతోందని సమాచారం. విజయసాయిని విచారిస్తేనే డ్రగ్స్ విషయం బయటపడుతుంది. పలు దందాల్లో విజయసాయి రాష్ట్ర బిగ్‌బాస్‌కు సహకరిస్తున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక విజయసాయి అవినీతిని ఛేదిస్తాం’’ అని బుద్దా వెంకన్న తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని