AP News: అధికార పార్టీ పెద్దల సేవలో డీజీపీ: ధూళిపాళ్ల

ఏపీలో డ్రగ్స్‌ వినియోగాన్ని సీఎం పరోక్షంగా అంగీకరిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

Published : 05 Oct 2021 14:03 IST

మంగళగిరి: ఏపీలో డ్రగ్స్‌ వినియోగాన్ని సీఎం పరోక్షంగా అంగీకరిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. డ్రగ్స్‌ను సీఎం చిన్న విషయంగా చెబుతున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇటీవల దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్‌ రవాణా బయటపడింది. డ్రగ్స్‌ ఆరోపణలపై పోలీసులు విచారణ జరపాలి. డీజీపీ తన బాధ్యతలను గాలికి వదిలేశారు. అధికార పార్టీ పెద్దల సేవలో డీజీపీ తరిస్తున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు రాష్ట్రంలోనే ఉంటున్నాయి. 

వైకాపా అధికారంలోకి వచ్చాక గంజాయి సాగు విపరీతంగా పెరిగింది. దాదాపు 15 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. వైకాపా నేతల కనుసన్నల్లోనే గంజాయి సాగు, రవాణా జరుగుతోంది. కాకినాడ తీరంలో ఇటీవల ఓ ఓడ తగలబడిపోయింది. ఓడ తగలబడిన విషయంలో పోలీసులు వాస్తవాలను దాస్తున్నారు. గోదాముల్లో గంజాయి నిల్వ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కావాలనే ఎక్సైజ్‌ శాఖను నిర్వీర్యం చేసి ఎస్‌ఈబీ తీసుకొచ్చారు’’ అని ధూళిపాళ్ల ఆరోపించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని