AP Politics: ఆర్భాటాలకు ఉన్న డబ్బు..బకాయిలు చెల్లించడానికి లేదా?: ధూళిపాళ్ల

తెలంగాణ పొలిస్తే ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ తక్కువగా చేస్తోందని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు

Updated : 24 Sep 2022 16:32 IST

మంగళగిరి: తెలంగాణ పొలిస్తే ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ తక్కువగా చేస్తోందని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ధాన్యం సేకరణ సరిగా జరగకపోవడం వల్ల రైతులు పంటలను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల రైతాంగం రూ. వేల కోట్లు నష్టపోయిందన్నారు. జొన్న, మొక్కజొన్న పంటలను అధికార పార్టీ నాయకులు రైతుల వద్ద తక్కువ ధరలకు కొని.. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ ధరలకు విక్రయించి రూ.లక్షలు సంపాదించారని నరేంద్ర ఆరోపించారు.

దీనిపై ఆయా జిల్లాల అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికీ వేల మంది రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఆర్భాటాలు, ప్రచారాల కోసం రూ.వేలకు వేలు ఖర్చు చేస్తున్నారని.. కొనుగోలు చేసిన పంటలకు చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదా అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని