AP Politics: దళితుల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: నక్కా ఆనంద్‌బాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరి హయాంలో దళితుల అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా?అని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు

Updated : 10 Aug 2021 12:46 IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఎవరి హయాంలో దళితుల అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా?అని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు సవాల్‌ విసిరారు. విజయవాడలో తెదేపా తలపెట్టిన దళిత ప్రతిఘటన ర్యాలీకి బయల్దేరిన ఆనంద్‌బాబును గుంటూరులోని నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్యను విజయవాడలో, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను నందిగామలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎస్సీల హక్కులు కాలరాయడమే జగన్‌ ఎజెండాగా మారిందని మాజీ మంత్రి జవహర్‌ దుయ్యబట్టారు.

‘‘దళిత ప్రతిఘటన ర్యాలీకి పోలీసులు అనుమతివ్వకపోవడం అప్రజాస్వామికం. వైకాపా రెండేళ్ల పాలనలో ఎస్సీలపైనే ఎక్కువగా దాడులు జరిగాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లిస్తున్నారు’’ అని ఆనంద్‌బాబు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని