
Updated : 20 Nov 2021 17:27 IST
AP News: తప్పు చేశామని గ్రహించే స్థాయిలో అధికార పక్షం లేదు : యనమల
అమరావతి: అసభ్య పదజాలంతో దూషణల పర్వంగా ఏపీ అసెంబ్లీ మారిందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. సభను అవమానిస్తూ ఆనందించే ధోరణి అధికార పార్టీలో ఉందని ఆయన ఆరోపించారు. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో యనమల స్పందించారు. సభలో లేని వాళ్లపై మాట్లాడకూడదనే మర్యాద విస్మరించారని ధ్వజమెత్తారు. నియంత్రించే పరిణామాలు లేనప్పుడు బహిష్కరించక ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలకు తావిస్తున్నప్పుడు ప్రజల తరఫున ప్రజల్లోకే వెళ్తామని యనమల అన్నారు. తప్పు చేశామని గ్రహించే స్థాయిలో అధికారపక్షం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
Tags :