Teenmar Mallanna: భాజపాలో చేరిన తీన్మార్‌ మల్లన్న

ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో

Updated : 07 Dec 2021 17:14 IST

దిల్లీ: ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్ ఆయనకు కాషాయ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భాజపా ప్రాథమిక సభ్యత్వాన్ని తీన్మార్ మల్లన్నకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని