Telangana Cabinet: ఈనెల 16న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 16న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. శాసనసభ సమావేశాల తేదీని భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది..

Updated : 14 Sep 2021 16:26 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 16న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. శాసనసభ సమావేశాల తేదీని భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 25లోగా ఉభయసభలు సమావేశం కావాల్సి ఉంది. దీంతో ఆ లోగా సమావేశాలను ప్రారంభించేలా నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల అంశంపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. దళితబంధు పథకంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు మరో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. పంటల సాగు, వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రం నిర్ణయం, సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల భర్తీ అంశంపై భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు