
KTR: సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ వ్యాఖ్యలు.. కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: ఏపీ భాజపా నేతలు మరింత దిగజారిపోయారని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మంగళవారం విజయవాడలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో చీప్ లిక్కర్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘వావ్.. వాట్ ఎ స్కీం.. వాట్ ఎ షేమ్. రూ.50లకే చీప్ లిక్కర్ భాజపా జాతీయ విధానమా?అధికారం కోసం బంపర్ ఆఫర్ ఇస్తున్నారా?’’ అని ప్రశ్నించారు.
విజయవాడ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం... చీప్ లిక్కర్ తయారుచేసి అమ్ముతోందని ఆరోపించారు. మద్యం తాగే ఒక్కొక్కరి నుంచి రూ.12 వేలు రాబట్టి, వాటినే ఏటా అకౌంట్లలో వేస్తోందన్నారు. రాష్ట్రంలో మద్యం తాగే కోటి మంది భాజపాకు ఓటేసి గెలిపించాలని కోరారు. చీప్ లిక్కర్ రూ.70కే ఇస్తామని.. రాబడి బాగుంటే రూ.50కే ఇస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా కేటీఆర్ స్పందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.