Published : 09/12/2021 01:48 IST

TMC: కాంగ్రెస్ యుద్ధంలో అలసిపోయింది..ఇప్పుడు టీఎంసీనే అసలైన కాంగ్రెస్..!

కోల్‌కతా: దిల్లీ వచ్చిన ప్రతిసారి సోనియాగాంధీని కలవాలా..? అసలు యూపీఏ ఎక్కడుంది..? అంటూ కాంగ్రెస్‌పై టీఎంసీ మొదలు పెట్టిన విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీ పత్రిక జాగో బంగ్లా ఈ తరహాలోనే స్పందించింది. కాంగ్రెస్ యుద్ధంలో అలసి పోయిందని, పార్లమెంట్‌లో ప్రధాన విపక్షం చేయాల్సిన పని చేయడం లేదని వ్యాఖ్యలు చేసింది. టీఎంసీనే.. అసలైన కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చింది. 

‘బెంగాల్‌లో భాజపాపై టీఎంసీ పోరాడి, విజయవంతమైంది. భాజపా విస్తరించిన రాష్ట్రాల్లోకి ఇప్పుడు టీఎంసీ ప్రవేశిస్తోంది. దేశంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం. కానీ వారు భాజపాను నిలువరించలేకపోయారు. కాంగ్రెస్ యుద్ధంలో అలసిపోయింది. అంతర్గత వర్గ పోరుతో బాధపడుతోంది. ఇప్పుడు టీఎంసీ ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను చేపట్టింది. తృణమూల్ కాంగ్రెసే అసలైన కాంగ్రెస్‌’ అంటూ పార్టీ పత్రిక అభివర్ణించింది. 

ఈ ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో  తృణమూల్ కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అది దేశవ్యాప్తంగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇమేజ్‌ను పెంచింది. ఈ క్రమంలో భాజపాకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలని ఆమె పావులు కదుపుతున్నారు.  గోవా, మేఘాలయ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో పార్టీ పలుకుబడిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు తోడయినట్లు తెలుస్తోంది. 
 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని