TS News: సంపన్నులకు లాభం చేకూర్చేలా ‘ధరణి’: మహాధర్నాలో కోదండరామ్‌

తెలంగాణలో ఆరోగ్య సంక్షోభం నెలకొందని తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. కొవిడ్ కారణంగా ఎంతో మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని ..

Updated : 22 Sep 2021 12:55 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఆరోగ్య సంక్షోభం నెలకొందని తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. కొవిడ్ కారణంగా ఎంతో మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ సమీపంలోని ధర్నాచౌక్‌ వద్ద ఆయన మాట్లాడారు. అంతకముందు ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలో ఉన్న ప్రజలను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షాలు పిలుపిచ్చిన మహాధర్నాను ఇందిరాపార్క్‌ నుంచి ప్రారంభించారు. ఇందులో కాంగ్రెస్, తెజస, సీపీఎం, సీపీఐ, తెదేపా, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. మహా ధర్నాకు బీఎస్పీ, వైతెపా హాజరుకాలేదు.

‘‘ఉద్యోగాలు లేక తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఇసుక, భూ దందాలు చేస్తోంది. సంపన్నులకు లాభం చేకూర్చేలా ధరణి చట్టం ఉంది. మనం సాధించుకున్న ధర్నా చౌక్ ఇవాళ మన హక్కుల కోసం ఉపయోగపడింది’’ అని కోదండరామ్‌ అన్నారు. మహాధర్నాలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నాయకులు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు బక్కిన నర్సింహులు, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీలు రాజయ్య, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని