Revanth Reddy: జైలులో మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారు: రేవంత్‌

ఖమ్మం జైలులో మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మానవ హక్కులను ఉల్లంఘించిన అధికారులను సస్పెండ్‌

Published : 12 Aug 2021 14:49 IST

హైదరాబాద్‌: ఖమ్మం జైలులో మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మానవ హక్కులను ఉల్లంఘించిన అధికారులను సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు. సెప్టెంబర్‌ 17లోపు పోడు భూములకు పట్టాలివ్వాలని.. రాష్ట్రంలోని ఎస్సీ, గిరిజనులకు రూ.10లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఐటీడీఏల పునరుద్ధరణకు నిధులు విడుదల చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంపై పోరు కొనసాగిస్తామని రేవంత్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని