రసాభాసగా సర్వసభ్య సమావేశం.. తెరాస, భాజపా శ్రేణుల వాగ్వాదం

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండల సర్వసభ్య సమావేశం తెరాస, భాజాపా శ్రేణుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో సమావేశం జరిగిన తర్వాత గందరగోళ పరిస్థితి నెలకొంది. సమావేశ..

Updated : 30 Sep 2022 14:48 IST

జైనథ్‌: ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండల సర్వసభ్య సమావేశం తెరాస, భాజాపా శ్రేణుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో సమావేశం జరిగిన తర్వాత గందరగోళ పరిస్థితి నెలకొంది. సమావేశ మందిరం నుంచి జోగు రామన్న బయటకు వెళ్తున్న సమయంలో.. భాజపా సర్పంచ్‌ పాయల్‌ శరత్‌ ప్రత్యేక అభివృద్ధి ఫండ్‌ (ఎస్‌డీఎఫ్‌) నిధుల వినియోగంపై ప్రశ్నించారు. ఎమ్మెల్యే సిఫారసు ఉంటేనే అధికారులు నిధులు కేటాయిస్తామంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి  శరత్‌ తీసుకెళ్లారు. అదే సమయంలో ఆకోలి గ్రామ సర్పంచ్‌ వాణి భర్త కేశవ్‌ అడ్డుతగిలారు. దీంతో శరత్‌, కేశవ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత తెరాస, భాజపా శ్రేణులు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం మండలాధ్యక్షుడు మార్చెట్టి గోవర్ధన్‌ సహా పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమనిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని