TS News: సాగు చట్టాల్లాగే ధాన్యం కొనుగోళ్లపై పునరాలోచించాలి: గుత్తా

గత యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని దురుద్దేశంతో గోదాముల నుంచి తరలించకుండా కేంద్రం, ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని

Updated : 20 Nov 2021 14:18 IST

హైదరాబాద్‌: గత యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని దురుద్దేశంతో గోదాముల నుంచి తరలించకుండా కేంద్రం, ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే వ్యాగన్లను కేటాయించక ఆలస్యం చేస్తున్నందునే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోయిందని చెప్పారు. కేంద్రం వెంటనే గోదాములను ఖాళీ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాయిల్డ్‌ రైస్‌ను కొనం అని కేంద్ర చెప్పడం సరికాదని.. సాగు చట్టాల మాదిరిగా కొనుగోలు విషయాన్ని పునరాలోచించాలని గుత్తా కోరారు. రెండో సారి శాననమండలికి తనను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని