TRS: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను బహిష్కరించిన తెరాస

ధాన్యం కొనుగోళ్ల అంశంపై తెరాస ఎంపీలు లోక్‌సభలో ఆందోళన కొనసాగించారు. నల్లచొక్కాలు ధరించి

Updated : 07 Dec 2021 15:37 IST

దిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను తెరాస బహిష్కరించింది. లోక్‌సభకు 9 మంది, రాజ్యసభ సమావేశాలకు ఏడుగురు ఎంపీలు దూరంగా ఉంటారని ఆ పార్టీ వెల్లడించింది. ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రం వైఖరిని నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

ధాన్యం కొనుగోళ్ల అంశంలో గత వారం రోజులుగా తెరాస ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆందోళనలు చేపట్టారు.  ధాన్యం, బియ్యం ఎంత సేకరిస్తారో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీలు మంగళవారం నల్లచొక్కాలు ధరించి పార్లమెంట్‌లో నిరసన తెలిపారు. ధాన్యం సేకరణకు సమగ్ర జాతీయ విధానం తేవాలని.. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సభ వెలుపలా ప్లకార్డులతో నిరసన తెలిపారు. తాము నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు (కేకే) ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం వైఖరిని చెప్పకపోవడం బాధాకరమన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని