TS News: రాజ్యసభ నుంచి తెరాస ఎంపీల వాకౌట్‌

తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెరాస ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. ధాన్యం కొనుగోలుపై రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్‌

Published : 03 Dec 2021 16:41 IST

దిల్లీ: తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెరాస ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. ధాన్యం కొనుగోలుపై రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని తెరాస సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే  తమ ఆందోళన కొనసాగుతుందని రాజ్యసభలో తెరాస పక్షనేత కె.కేశవరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ వద్ద తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరారవు మీడియాతో మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. గత ఐదురోజుల నుంచి తెరాస ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని పదే పదే కోరినా   పట్టించుకోలేదన్నారు. ‘‘దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు విధానం ప్రవేశ పెట్టాలని, తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదు. మోదీ ప్రభుత్వం పేదల, రైతు, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది’’ అని నామా ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని