Ts News: ప్రారంభమైన తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ ప్రారంభమైంది. ..

Updated : 30 Sep 2022 14:35 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ ప్రారంభమైంది. సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై సమావేశంలో చర్చించనున్నారు. నవంబరు 15వ తేదీన వరంగల్‌ విజయగర్జన సభ నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పురోగతిపై సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర కమిటీలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని