TS News: కేంద్రం వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ‘చావు డప్పు’

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిపై తెరాస శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ‘ఊరూరా చావు డప్పు’

Updated : 20 Dec 2021 14:43 IST

హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిపై తెరాస శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ‘ఊరూరా చావు డప్పు’ పేరుతో నిర్వహించిన నిరసనల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

గజ్వేల్‌లో మంత్రి హరీశ్‌రావు, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ తదితరులు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో  ఎమ్మెల్యేలు, స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధాన్యం బస్తా తలపై మోస్తూ నిరసన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని