TS News: 6 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తెరాస విజయకేతనం

తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మె్ల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస విజయకేతనం ఎగురవేసింది. 12స్థానాలకు గానూ 6 ఏకగ్రీవం కాగా మరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Updated : 14 Dec 2021 12:04 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస జయకేతనం ఎగురవేసింది. 12 స్థానాలకు గానూ 6 ఏకగ్రీవం కాగా మరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఆరు స్థానాల్లోనూ తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రెండు స్థానాల్లో ఎల్‌.రమణ, భానుప్రసాద్‌ విజయం సాధించారు. భానుప్రసాద్‌కు 584, రమణకు 479 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్‌లో తెరాస అభ్యర్థి దండె విఠల్‌ గెలుపొందారు. 667 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. 

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి తాతా మధు గెలుపొందారు. ఇక్కడ తెరాసకు 480, కాంగ్రెస్‌కు 242, స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు పోలయ్యాయి. 12 ఓట్లను చెల్లనివిగా గుర్తించారు. నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ తెరాస అభ్యర్థికి 917, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన నగేశ్‌కు 226, లక్ష్మయ్యకు 26, వెంటేశ్వర్లుకు 6, రామ్‌సింగ్‌కు 5ఓట్లు పోలయ్యాయి. 50 ఓట్లు చెల్లనివిగా అధికారులు తేల్చారు. మరోవైపు మెదక్‌లోనూ అధికార పార్టీ అభ్యర్థి యాదవరెడ్డి 524ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ తెరాసకు 762, కాంగ్రెస్‌ 238, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు పోలయ్యాయి. 12 చెల్లని ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని